వారికి మాత్రమే న్యాయం జరుగుతోంది : మాజీ ఎంపి

Saturday, December 15, 2018 11:35 PM Politics
వారికి మాత్రమే న్యాయం జరుగుతోంది : మాజీ ఎంపి

తెలుగుదేశం ప్రభుత్వంలో పచ్చ చొక్కాలు, టీడీపీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలోకొచ్చిన తర్వాత టీడీపీ ఒక్క హామిని కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రజల్ని మోసం చేసిందని వ్యాఖ్యానించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే అది వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమని ఉద్ఘాటించారు. ప్రతి బూత్‌ కన్వీనర్‌ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.