కళలేని ప్రేలాపనలు

Sunday, December 16, 2018 06:59 AM Politics
కళలేని ప్రేలాపనలు

"టీఆరెస్ తో జగన్ కు రహస్య పొత్తు ఉన్నది.  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాను వ్యతిరేకించిన కేసీఆర్ తో ఎలా పొత్తు పెట్టుకుంటాడు?  కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడం అంటే ఆంధ్రులను వంచించడమే" అని ఆర్తనాదాలు చేస్తున్నారు కళా వెంకట్రావు అనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. 

అసలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే నేను కేసీఆర్ తో పొత్తుకు పదిసార్లు ప్రయత్నించాను...ఇద్దరం కలిసి పనిచేద్దాం అన్నాను.. కానీ కేసీఆర్ తిరస్కరించడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసాను అని ఒకటికి వందసార్లు చెప్పిన విషయం ఈయనకు తెలియదా?  తెలుగుదేశం కుమతులు అందరూ ఇంతేనా లేక తాము ఏమి వాగినా మీడియా కవర్ చేస్తుందని అహంకారమా?   ప్రత్యేక హోదా వద్దే వద్దని నాలుగేళ్లపాటు లక్షలసార్లు చెప్పింది చంద్రబాబు కాదా?  

రాష్ట్రాన్ని చీల్చారని ఆంధ్రులు వెయ్యి అడుగుల లోతులో 2014 లో పూడ్చిపెట్టిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుకుని ఆంధ్రులను వంచిస్తున్నది తెలుగుదేశం అని, రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా సమాధి తప్పదని కళాగారికి ఎప్పుడు తెలుస్తుంది?  

నాకు తెలియక అడుగుతాను... టీఆరెస్ తో మాకు పొత్తు ఉన్నదని జగన్ ఎప్పుడైనా చెప్పాడా?  తాము చేసిన వెధవ పనులను ఇతరులమీదికి తోసేసి నిందలు వెయ్యడంలో తెలుగుదేశం నాయకులకు సాటిలేరు.  అయినా సాటి తెలుగువారి పార్టీతో నెయ్యం నెరపితే అది నేరం ఎలా అవుతుంది?

- ఇలపావులూరి మురళి మోహన్ రావు