జగన్ మూడు రోజుల పాలన: విప్లవాత్మక మార్పులు!!

Sunday, June 2, 2019 02:50 PM Politics
జగన్ మూడు రోజుల పాలన: విప్లవాత్మక మార్పులు!!

భారీ మెజార్టీతో గెలుపొందిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మే 30న ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలన పగ్గాలు అందుకున్న కేవలం మూడు రోజుల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకుని, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారి తొలి 3 రోజుల పాలనలో జరిగిన కీలక మార్పులేంటో చూద్దాం రండి...

  • వృద్ధుల పెన్షన్ 2000 నుండి 2250 కి పెంపు
  • వికలాంగుల పెన్షన్ 2000 నుండి 3000 కి పెంపు
  • కిడ్నీ రోగులకు పెన్షన్ 3500 నుండి 10,000 కు పెంపు
  • మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం 1000 నుండి 3000 లకు పెంపు
  • 44,000 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి
  • ఒత్తిడిలేని విద్య కోసం ప్రతి శనివారం No Bag Day
  • మూసివేయబడిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు రీఓపెన్
  • YSR అక్షయపాత్ర పథకం ద్వారా బడిపిల్లలకు పౌష్టికాహారం
  • అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్లాన్ రెడి చేయాలని అధికారులకు ఆదేశాలు
  • రంజాన్ సందర్భంగా 13 జిల్లాలోని మసీదులకు మరమ్మత్తులు,పెయింట్ ఖర్చుల నిమిత్తం 4 కోట్లు విడుదల
  • రంజాన్ పండుగ సందర్భంగా 13 జిల్లాల్లో ఇఫ్తార్ విందు ఖర్చుల నిమిత్తం జిల్లాకు 5 లక్షల చొప్పున 55 లక్షల విడుదల
  • ప్రమాణ స్వీకారం ఖర్చును 15 లక్షల్లోనే ముగించిన జగన్
  • నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకునే పని చేస్తానని స్పష్టం
  • ప్రభుత్వ కార్యక్రమల్లో ఇకపై అతి ఖరీదైన హిమాలయ వాటర్ బాటిల్స్ నిషేధం.

For All Tech Queries Please Click Here..!