మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్.. ఎవరెవరికి ఏ శాఖ?

Saturday, June 8, 2019 04:53 PM Politics
మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్.. ఎవరెవరికి ఏ శాఖ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 25 మందిని మంత్రులుగా నియమించేందుకు అభ్యర్థుల జాబితాలను గవర్నర్‌కు అందజేశారు. శనివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో గవర్నర్ సమక్షంలో ఎంపిక చేసిన అభ్యర్థుల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ సీఎం జగన్ శాఖలు కేటాయించారు.

1. మేకతోటి సుచరిత: హోంశాఖ (డిఫ్యూటీ సీఎం)

2. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి: గనుల శాఖ, పంజాయతీరాజ్ శాఖ

3. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి : ఆర్థికశాఖ, శాసనసభా వ్యవహారాలు

4. తానేటి వనిత: మహిళా, స్త్రీ సంక్షేమశాఖ

5. కె.నారాయణస్వామి: సాంఘిక సంక్షేమశాఖ

6. పాముల పుష్ప శ్రీవాణి: గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)

7. పిల్లి సుభాష్ చంద్రబోస్: రెవిన్యూ శాఖ (డిప్యూటీ సీఎం)

8. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి : అటవీ శాఖ

9. కొడాలి నాని: పౌరసరఫరాలశాఖ

10. ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమం

11. ధర్మాన కృష్ణదాస్ : రోడ్లు, భవనాలు

12.బొత్స సత్యనారాయణ : మున్సిపల్ శాఖ

13. విశ్వరూప్ : ఎక్సైజ్, ఎస్సీ సంక్షేమం

14. కురసాల కన్నబాబు : వ్యవసాయ శాఖ

15. రంగనాథరాజు : గృహ నిర్మాణం

16. ఆళ్ల నాని : వైద్య శాఖ

17. అనిల్ కుమార్ యాదవ్ : ఇరిగేషన్ శాఖ

18. పేర్ని నాని : రవాణా, సమాచార శాఖ

19. వెల్లంపల్లి శ్రీనివాస్ : దేవాదాయ శాఖ

20. మోపిదేవి వెంకటరమణ : మత్స్య శాఖ

21. గుమ్మనూరు జయరాం : కార్మిక, ఉపాది శాఖ

22. మేకపాటి గౌతంరెడ్డి : పరిశ్రమలు, వాణిజ్య శాఖ

23. ఆదిమూలపు సురేష్ : విద్యా శాఖ

24. అవంతి శ్రీనివాస్ : పర్యాటకం

25. శంకర్ నారాయణ : బీసీ సంక్షేమం

For All Tech Queries Please Click Here..!