కియా మీద "కమ్మ"ని కుట్ర.. అసలు వాస్తవాలేంటి..? కల్పిత పుకార్లేంటి?

Friday, February 7, 2020 07:01 AM Politics
కియా మీద

ఈ వార్తలో వాస్తవం ఏమిటో తెలుసుకునేందకు కియా మోటార్స్ ఇండియాతో మీడియా మాట్లాడింది. రాయిటర్స్ ఇండియా ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవం. మేం ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగుతాం అని కియామోటార్స్ ఇండియా అధికార ప్రతినిధి శ్యామ్ అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వార్త పూర్తిగా నిరాధారమని చెప్పింది. తాము కియో సంస్థతో కలిసి పని చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు.

దీనికి సంబంధించి వివరణ కోసం తమిళనాడు ప్రభుత్వ అధికారుల్ని కూడా మీడియా సంప్రదించింది. తన పేరు వెల్లడించవద్దని కోరిన తమిళనాడు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు, " కియా సంస్థ మమ్మల్ని ఎప్పుడూ సంప్రదించలేదు. మేం కూడా వారితో ఎలాంటి చర్చలు జరపలేదు" అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2017లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రెండేళ్లలోనే నిర్మాణాన్ని పూర్తి చేసుకొని 2019 ద్వితియార్థం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఏడాదికి 3 లక్షల కార్ల తయారు చేసే సామర్థ్యం గల ఈ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 12 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: