జగన్ ప్రభుత్వానికి వరుస షాక్ లు: కార్యాలయల తరలింపుకు బ్రేక్: జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు

Friday, March 20, 2020 01:54 PM Politics
జగన్ ప్రభుత్వానికి వరుస షాక్ లు: కార్యాలయల తరలింపుకు బ్రేక్: జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు

వరుసగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు న్యాయ పరంగా చుక్కెదురైంది. ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా,కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా,న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే శాఖలను కర్నూలును తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోల జారీ విషయంలోనూ వివాదం నెలకొని ఉంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తి సమాచారం లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి సూచన మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగింది. ఇక, ఈ జీవోల పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ల పైన ప్రభుత్వ వివరణ కోరింది. ప్రభుత్వం నుండి సమాధానం వచ్చిన తరువాత హైకోర్టు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.