తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా

Monday, December 10, 2018 10:51 PM Politics
తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ఓ కొలిక్కి వచ్చాయి ఇక ఫలితాలే తరువాయి అనుకున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిచాలని ఉమ్మడి హైకోర్టు సూచించింది. ఫలితాలు తర్వాత ఏర్పడే ప్రభుత్వం అనుమతిస్తే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమీషన్ కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మూడు వారాలకు వాయిదా చేసింది. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు సూచించింది.

ఏ ఏడాది ఆగష్టుతోనే పంచాయతీల పాలన గడువు ముగియడంతో సెప్టెంబరులోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే, ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్లు అంశాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంపై స్పందించిన కోర్టు మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, జనవరి 10వ తేదీలోగా పాలకవర్గాలకు బాధ్యతలను అప్పగించాలని స్పష్టం చేసింది.