జగన్ కేబినెట్‌లో మంత్రులు వీల్లే.. తుది జాబితా ఇదిగో!

Saturday, June 8, 2019 08:23 AM Politics
జగన్ కేబినెట్‌లో మంత్రులు వీల్లే.. తుది జాబితా ఇదిగో!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఖరారయ్యింది. వైఎస్ జగన్ తన కేబినెట్‌లో 25 మంది ఆశావహులకు మంత్రులుగా అవకాశం ఇచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ మంత్రి వర్గాన్ని కూర్పు చేశారు. ఏపీ మంత్రివర్గంలోని 25 మందిలో 8 మంది బీసీలు, 5 మంది రెడ్డి, నలుగురు కాపులకు స్థానం కేటాయించారు. ఎస్సీలు నలుగురికి పదవులు కేటాయించారు. క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో స్థానం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ పదవిని బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయించారు. 

ఇవాళ ఉదయం జరిగిన సీఎల్పీ సమావేశంలో మంత్రివర్గ సభ్యులను ఖరారు చేసిన అనంతరం, మంత్రులుగా ఎంపికైన వారికి స్వీకార మహోత్సవానికి ఆహ్వానం అందింది. శనివారం ఉదయం 11.49 గంటలకు సచివాలయం ప్రాంగణంలో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
మంత్రివర్గంలో స్థానం లభించిన వారి వివరాలు..

  • ధర్మాన కృష్ణదాస్  - నరసన్నపేట, శ్రీకాకుళం
  • బోత్స సత్యనారాయణ (బీసీ) - చీపురుపల్లి, విజయనగరం
  • పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ) ఎమ్మెల్సీ  - తూర్పుగోదావరి
  • మోపిదేవి వెంకటరమణ (బీసీ) - గుంటూరు
  • అనీల్ కుమార్ యాదవ్ (బీసీ) - నెల్లూరు
  • శంకర నారాయణ (బీసీ) - పెనుకొండ, అనంతపురం
  • గుమ్మనూరు జయరాం (బీసీ)  - ఆలూరు, కర్నూలు
  • వెంకటరమణ (బీసీ) - గుంటూరు
  • పినిపె విశ్వరూప్ (ఎస్సీ)  - అమలాపురం, తూర్పుగోదావరి
  • తానేటి వనిత (ఎస్సీ) - కొవ్వూరు, తూర్పుగోదావరి
  • మేకతోటి సుచరిత (ఎస్సీ)  - పత్తిపాడు, గుంటూరు
  • నారాయణ స్వామి (ఎస్సీ) - గంగాధర నెల్లూరు, చిత్తూరు
  • ఆదిమూలపు సురేశ్ (ఎస్సీ) - ఎర్రగొండపాలెం ప్రకాశం
  • అవంతి శ్రీనివాస్ (కాపు) - భీమిలి, విశాఖపట్టణం
  • ఆళ్ల నాని  (కాపు) - ఏలూరు, తూర్పుగోదావరి
  • కురసాల కన్నబాబు (కాపు) - కాకినాడ రూరల్, తూర్పుగోదావరి
  • పేర్ని నాని (కాపు) - మచిలీపట్నం, కృష్ణా
  • బాలినేని శ్రీనివాస్ రెడ్డి (రెడ్డి)  - ఒంగోలు, ప్రకాశం
  • మేకపాటి గౌతమ్ రెడ్డి (రెడ్డి)  - ఆత్మకూరు, నెల్లూరు
  • పెద్దిరెడి రామచంద్రారెడ్డి (రెడ్డి) - పుంగనూరు చిత్తూరు
  • బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి (రెడ్డి) - డోన్, కర్నూలు
  • కొడాలి నాని (కమ్మ) - గుడివాడ, కృష్ణా
  • అంజద్ పాషా (మైనార్టీ) - కడప, కడప
  • చెరుకువాడ శ్రీరంగ నాథరాజు (క్షత్రియ) - ఆచంట, తూర్పుగోదావరి
  • పాముల పుష్ప శ్రీవాణి (ఎస్టీ)  - కురుపాం, విజయనగరం
  • వెల్లంపల్లి శ్రీనివాస్ (వైశ్య)  - విజయవాడ పశ్చిమ, కృష్ణా

వీరిని తొలి రెండున్నరేళ్ల పాటు కొనసాగించి, రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా వీరి స్థానంలో ప్రస్తుతం మంత్రి పదవి ఆశించి, భంగపడిన వారిని మంత్రులుగా నియమిస్తానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

For All Tech Queries Please Click Here..!