నిమ్మగడ్డకు సీఎం జగన్ చెక్: ఆయన అధికారాలకు కత్తెర వేసేలా కొత్త వ్యూహంతో ముందుకిలా.!

Thursday, March 19, 2020 02:07 PM Politics
 నిమ్మగడ్డకు సీఎం జగన్ చెక్: ఆయన అధికారాలకు కత్తెర వేసేలా కొత్త వ్యూహంతో ముందుకిలా.!

ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన వివాదం కొత్త మలుపు తీసుకుంటుంది. ప్రభుత్వానికి సమచారం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వాయిదా వేయటం పైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ముఖ్యమంత్రి తో సహా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తాజాగా ఎన్నికల కమిషనర్ రాసినట్లుగా వైరల్ అయిన లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని డామేజ్ చేసే విధంగా వ్యాఖ్యలు ఉండటంతో. దీని పైన ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. నేరుగా డీజీపీ. నిఘా చీఫ్ తో అసలు ఈ లేఖ తాను రాయలేదని నిమ్మగడ్డ స్పష్టం చేయటంతో.ఎక్కడి నుండి ఈ లేఖ వచ్చింది,.ఎవరు ప్రచారంలోకి తెచ్చారనే అంశం పైన చర్చిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్నికల కమిషనర్ పేరుతో తనకున్న విచక్షణాధికారాలకు కత్తెర వేసేలా ముఖ్యమంత్రి కొత్త వ్యూహం అమలుకు సిద్దమయ్యారు.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేక పోవటంతో. కమిషనర్ గా ఆయన అధికారాలకు చెక్ పెట్టేందుకు నిపుణులతో కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పని చేసిన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డితోనూ జగన్ సమావేశమయ్యారు. ఆ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒకరే కమిషనర్ ఉండటంతో, మరో ఇద్దరు సభ్యుల నియామకానికి అవకాశం ఉంటుందని. ఈ విధంగా చట్ట సవరణ చేసి కొత్త సభ్యులను నియమించిటం ద్వారా ఒకే కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ అధికారాలకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.

For All Tech Queries Please Click Here..!