కొత్త దారిలో చంద్రబాబు, ఢీకొట్టే సత్తా ఎంత ?

Wednesday, September 25, 2019 03:57 PM Politics
కొత్త దారిలో చంద్రబాబు, ఢీకొట్టే సత్తా ఎంత ?

గత ఎన్నికల్లో  చరిత్రలో లేని పరాభవాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు. అధికార పార్టీ వైసిపి దాని అధినేత జగన్ దెబ్బకు ఆ పార్టీ కేవలం 23 సీట్లతోనే సరిపెట్టుకుంది. మరి ఏపిలో పరాజయం పాలైన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన గురిని తెలంగాణా మీదకు విసిరాడు.  తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడానికి బాబు కృషి చేస్తానని చెప్తున్నాడు. ఏపీ, తెలంగాణలో టీడీపీ శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరమని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీకి కార్యకర్తలే బలమని చెప్పారు.

అయితే బాగా పట్టున్న ఏపీలోనే 23 స్థానాలతో సరిపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో కేసీఆర్ ని నిలువరించేందుకు పావులు కదుపుతోంది. కాగా 2014 తరువాత తెలుగుదేశం పార్టీ బలం తెలంగాణాలో తగ్గిపోతూ వచ్చింది.  2019లో ఖమ్మం జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు.  గెలిచిన తరువాత అయన కూడా తెరాసలో చేరిపోయాడు. ఇప్పుడు తెలంగాణాలో టీడీపీ పరిస్థితి జీరో అనే చెప్పాలి.  

జీరో స్థాయి నుంచి తిరిగి పార్టీని హీరో స్థాయికి తీసుకొస్తానని బాబు చెబుతున్నారు. మరి అది సాధ్యం అయ్యే పనేనా.  పైగా పార్టీ నాయకులు పార్టీ మారారుగాని, కార్యకర్తలు కాదని అంటున్నాడు.  మరి కార్యకర్తలు పార్టీ వెంట ఉంటే ఎవర్ని నిలబెట్టినా గెలవాలి కదా అని పలువురు చర్చించుకుంటున్నారు.  మరి ఆంధ్రాను వదిలి తెలంగాణాలో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బాబు ఎందుకు తాపత్రయపడుతున్నారు. కారణాలు చాలానే ఉన్నాయి. 

తెలంగాణాలో సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పార్టీపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.  దీనికి ప్రధాన కారణం బీజేపీ అని చెప్పక తప్పదు. బీజేపీ తన తెలివిని ప్రదర్శించి గత పార్లమెంట్ ఎన్నికల్లో  4 స్థానాలను కైవసం చేసుకుంది.  తెరాస కేవలం 9 సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది. తెరాస కు పట్టున్న నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంట్  నియోజక వర్గాల్లోబిజెపి విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే కేసీర్ ఇమేజ్ తగ్గుతుందని గమనించిన బాబు తెలంగాణాలో తన సత్తా చాటాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చంద్రబాబుకు దిమ్మతిరిగే రిటర్న్ గిప్ట్ అందించిన కేసీఆర్ ని ఢీకొట్టి చంద్రబాబు అక్కడ ఎలా చక్రం తిప్పుతాడో వేచి చూడాలి. 
 

For All Tech Queries Please Click Here..!