వెళ్లాలా?.. వద్దా?: చంద్రబాబు డైలమా

Saturday, December 15, 2018 11:09 PM Politics
వెళ్లాలా?.. వద్దా?: చంద్రబాబు డైలమా

మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలన్నరాహుల్ గాంధీ ఆహ్వానంపై ఏపీ సీఎం చంద్రబాబు... మంత్రుల అభిప్రాయం కోరారు. మంత్రులు కళా వెంకట్రావు, యనమల, లోకేష్, అచ్చెన్న, ఆనందబాబు, కాల్వ‌తో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్లాలా వద్దని అడిగారు. బీజేపీయేతర పక్షాల సమావేశానికి వచ్చిన నేతలను రాహుల్ గాంధీ ఆహ్వానించినట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. అయితే వెళ్లాలని కొందరు మంత్రులు...తుది నిర్ణయం తమదేనని మరికొందరు మంత్రులు చంద్రబాబు చెప్పారు. దీంతో వెళ్లాలా?.. వద్దా? అనే డైలామాలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.