రైలుకు వెనుక వైపున "X" మార్కు ఎందుకు ఉంటుంది...?

Thursday, December 6, 2018 11:15 PM Offbeat
రైలుకు వెనుక వైపున

మనం తరచూ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పటికీ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒకటి ప్రతి రైలుకు చివర్లో ఉండే రైలు పెట్టకు వెనుక వైపున పసుపు రంగులో ఓ "X" మార్కు ఉంటుంది. అసలు ఇలా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..?

ఈ "X" గుర్తు నిజానికి రైల్వే అధికారులు అవసరాల కోసం మాత్రమే ఉంటుంది. రైలు పెట్టెకు చివరిలో ఇలాంటి "X" మార్కు ఉంటే ఆ రైళ్లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని అర్థం. అంతే కాకుండా ఆ రైలు సురక్షితంగా ప్రయాణిస్తోందని సూచిస్తుంది.

"X" మార్కు క్రింద ఓ ఎర్రటి లైటును చాలా వరకు గమనించి ఉంటా. ప్రతి ఐదు సెకండ్లకు ఒకసారి వెలుగుతూ ఉండే దీనిని రాత్రి వేళల్లో చాలా సార్లు గమనించి ఉంటాం. దీనిని కూడా రైలు సేఫ్టీ పరంగా ఉపయోగించేవారు ఒకప్పుడు ఈ లైటు స్థానంలో ఇంధనంతో వెలిగే దీపాలు ఉండేవి ఆ తర్వాత కాలంలో ఎలక్ట్రిక్ లైట్లు వచ్చేశాయి.

"X" మార్కు క్రింద కుడివైపున LV అక్షరాలు ఉన్న ఒక చిన్న బోర్డు వేళాడుతూ ఉంటుంది. ఎరుపు రంగు బోర్డు మీద తెలుపు లేదా నలుపు రంగులో LV అనే ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఈ బోర్డు రైలు సురక్షితంగా ఉందనే విషయాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఈ బోర్డు లేకపోతే ఆ రైలులో సాంకేతిక సమస్య ఉందని అర్థం.