ఇక భాష ఏదైనా నో ప్రాబ్లం!

Tuesday, February 18, 2020 10:44 AM Offbeat
ఇక భాష ఏదైనా నో ప్రాబ్లం!

మీరు ఆంగ్ల భాషలోని ఓ సినిమా వీక్షిస్తున్నారనుకోండి. ఆ సినిమాలో మాట్లాడుతున్న భాష అర్థంకాక ఇబ్బంది పడుతున్నారా? ఇకపై ఆ అవస్థలు తీరనున్నాయి. భాష ఏదైనా, ఆ మాట్లాడే వ్యక్తి భావాన్ని యథాతథంగా తెలుగు భాష లోకి మార్చే సరికొత్త టూల్‌ను ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ– హైదరాబాద్‌ రూపొందించింది. మిషన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలో ఇదో సరికొత్త ఆవిష్కరణ అని ఐఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. వీడియో క్లిప్‌ను ఒక భాష నుంచి మరో భాషలోకి తేలికగా అనువదించేందుకు ఈ టూల్‌ అద్భుతంగా పనిచేస్తుందని ఐఐఐటీ–హెచ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం తెలిపింది. 

రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డీన్‌ జవహర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఇంగ్లిష్‌ భాష నుంచి పలు భారతీయ భాషల్లోకి వివిధ రకాలైన వీడియో క్లిప్‌లను ఈ టూల్‌ ద్వారా మార్చుకోవచ్చు. డబ్బింగ్‌ సినిమాలు, యానిమేషన్, మీడియా రంగాలకు ఈ టూల్‌ ఉపయుక్తంగా ఉంటుంది. పెదాల కదలికల ఆధారంగా జరిగే సంభాషణ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా, లిప్‌ సింక్రనైజేషన్‌ మిస్‌ కాకుండా మార్చుకోవచ్చు. టెక్నాలజీ పరిభాషలో ఈ ఆవిష్కరణను లిప్‌గాన్‌ మాడ్యూల్‌ అంటారు. తర్జుమా అయ్యే భాషకనుగుణంగా ఈ మాడ్యూల్‌ వీడియో క్లిప్‌లోని వ్యక్తి లిప్‌ మూమెంట్‌ను సరిచేస్తుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: