ఏరియా 51 మిస్టరీ: ఏలియన్స్‌పై ప్రయోగాలు - అంతు చిక్కని నిజాలు

Wednesday, December 19, 2018 11:45 PM Offbeat
ఏరియా 51 మిస్టరీ: ఏలియన్స్‌పై ప్రయోగాలు - అంతు చిక్కని నిజాలు

ఎన్నో ఏళ్లుగా కొన్ని కోట్ల మందికి అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయిన వాటిలో ఏరియా 51 ఒకటి. అసలు ఏరియా 51 అంటే ఏమిటి...? అక్కడ ఏం జరుగుతోంది...? దానిని అంత రహస్యంగా ఎందుకు ఉంచారు...? ఇలాంటి అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో... ఇవాళ్టి స్టోరీలో ఏరియా 51 గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి...

ఏరియా 51 అనే ప్రాంతం అమెరికాలోని నెవడాలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఎంత అంటే కనీసం ఆ దేశానికే చెందిన యుద్ద విమానాలు... మరే ఇతర సాయుధ విమానాలు కూడా ఆ ప్రాంతం మీదుగా వెళ్లకూడదు. అంతే కాదు ఏరియా 51 లో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ ప్రాంతంలోని రోడ్ల మీద తిరగకూడదు. ఏరియా 51 సమీపంలో ఉన్న మికోనోస్ అనే ఎయిర్ పోర్ట్‌ నుండి ప్రతి రోజు వేల మంది ఉద్యోగులను విమానాల్లో అక్కడికి చేరవేస్తారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఆ విమానాలను గుర్తించేందుకు ఎలాంటి అంకెలు.. గుర్తులు కూడా ఉండవు. బయటి ప్రపంచానికే కాదు ఏరియా 51లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఎన్నో విషయాలు తెలియకుండా జాగ్రత్తపడతారు. అక్కడ జరిగే ప్రతి పనిని కూడా ఆయా ఉద్యోగులు ఎంతో గోప్యంగా ఉంచుతారు. 

1950 నుండి 1970 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో గుండ్రటి ఆకారంలో ఉన్న ఎగిరే వస్తువులను (UFO)లను అక్కడి ప్రజలు చూసినట్లు, ఇవి ఏలియన్స్‌కు చెందిన వాటివిగా చెప్పుకొచ్చారు. టెక్నాలజీ అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న కాలంలో వీటిని చూసిన వారు ఏలియన్స్‌గానే భావించారు. ఏరియా 51ను అప్పటికే అత్యంత గోప్యంగా ఉంచడంతో ఇక్కడికి ఏలియన్స్ వచ్చి వెళుతుంటారని... ఏలియన్స్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయని అప్పట్లో చెప్పుకునేవారు. అమెరికా 50 రాష్ట్రాల సమూహారం.. కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎలాంటి జనజీవనం లేని ఈ రహస్యం ప్రాంతానికి 50 రాష్ట్రాలకు కొనసాగింపుగా ఏరియా 51 అనే పేరు వచ్చినట్లు కొందరి వాదన. అమెరికా తీసుకున్న కట్టుదిట్టమైన భద్రత మరియు కఠిన నిర్ణయాలతో ఏరియా 51 ప్రపంచంలోనే అతి పెద్ద మిస్టీరియస్ ప్రదేశంగా మారిపోయింది.

చరిత్రను ఇంకాస్త వెనక్కి తిరగేస్తే ఏరియా 51 పుట్టు పూర్వోత్తాలతో సహా దీని రూపాంతంరం.. దీని అవసరం.. ఇందులో ఉన్న అసలు మిస్టరీ ఏంటో బయటపడింది. విరాల్లోకి వెళితే... 1850లో లాస్ వెగాస్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెవెడా ఎడారిలో లెడ్ మరియు సిల్వర్ అనే ధాతువులు ఉన్నట్లు గుర్తించారు. వీటి కోసం అప్పట్లో మొదలుపెట్టిన తవ్వకాలు 1918 వ సంవత్సరం వరకు నిర్విరామంగా కొనసాగాయి. సుమారుగా 70 సంవత్సరాల పాటు మైనింగ్ చేయడంతో భూగర్భంలో అత్యంత విశాలంగా సొరంగం ఏర్పడింది. సరిగ్గా అప్పట్లోనే రెండవ ప్రపంచం యుద్దం మొదలైంది. రష్యా వద్ద ఉన్న మిగ్ విమానాల కంటే శక్తివంతమైన విమానాలను అందుకు కావాల్సిన సాంకేతికంగా పరిజ్ఞానంతో పాటు మిలిటరీ పరికరాలను అభివృద్ది చేసుకోవాలనే ఆలోచనలో పడింది అమెరికా. అప్పటికప్పుడు అత్యంత రహస్యమైన ప్రాంతం ఎక్కడ దొరుకుతుందని ఆలోచనలో పడిన ప్రభుత్వం నెవెడా ఏడారిలో ఉన్న ఈ మైనింగ్ ప్రదేశాన్ని అత్యంత అనువైన ప్రాంతంగా ఎంచుకుంది.  ఈ తరువాత దశల వారీగా అమెరికా మిలటరీ అధికారులు ప్రయోగాలు మొదలు పెట్టారు. అయితే, 1948 లో రోస్‌వెల్ట్ అనే ప్రాంతంలో గుండ్రటి ఆకారంలో ఉన్న తిరిగే వస్తువు ఈ ప్రాంతంలో కూలిపోయింది. అమెరికా మిలిటరీ అధికారులు దీనిని స్వాధీనం చేసుకుని ఏరియా 51కు తరలించారు. తర్వాత సుమారు రెండు నెలల పాటు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. దీంతో అక్కడ నిజంగానే ఏలియన్స్‌కు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయనే వాదనలు మరింత బలమయ్యాయి.

ఏరియా 51 ప్రాంతంలో కూలిపోయిన గుండ్రటి ఆకారంలో ఉన్న వస్తువు ఓ స్పేస్ షిప్ అని... అందులో చనిపోయిన ఇద్దరు ఏలియన్స్ ఉన్నారని అక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి చనిపోక ముందు డైరీలో రాసుకున్నాడు. 1966 నుండి 1979 మధ్య కాలంలో ఏరియా 51లో పనిచేసిన ఓ ఇంజనీరు అంతరిక్షంలో ఉన్న ఇతర జీవ ప్రాణులను కనిపెట్టే అధునాతన పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడంలో తాను ఓ ఏలియన్‌తో కలిసి పనిచేసినట్లు చనిపోయేముందు చెప్పారు. "1989లో బాబ్ లేజర్ అనే ఏరియా 51 మాజీ ఉద్యోగి బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వూలో తాను పనిచేస్తున్నపుడు 9 రియల్ స్పేస్ షిప్‌లను చూశాను.. రివర్స్ ఇంజనీరింగ్ పద్దతి ద్వారా వాటిలోని టెక్నాలజీని తెలుసుకునేందుకు ప్రయత్నించానని తెలిపాడు. ఏలియన్స్ వినియోగించిన స్పేస్ షిప్ ఇంధనంలో అటామిక్ బరువు 115 గల ఓ మూలకం ఉంది, దీనికి వ్యతిరేక గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఈ మూలకం పేరు యునన్‌పెంటియం అని చెప్పాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... యునన్‌పెంటియం 115 మూలకం గురించి ప్రస్తావించిన సుమారుగా 14 ఏళ్ల తర్వాత ఈ మూలకాన్ని కనిపెట్టారు. అంతే కాకుండా... ఏలియన్స్ లక్ష సంవత్సరాల నుండి భూమికి వచ్చి వెళుతున్నారని.. భూమి నుండి సుమారుగా 39 కాంతి సంవత్సరాల దూరంలో ఏలియన్స్ ఉన్నట్లు పేర్కొన్నాడు." ఇవన్నీ ఎంత వరకు నిజమే చరిత్రకే ఎరుక.

ఏరియా 51 యొక్క అసలు అవసరం.. అందులో జరిగిన ప్రయోగాల విషయానికి వస్తే అమెరికా తర్వాత కాలంలో కంటికి కనిపించని యు2 అనే ఎయిర్ క్రాఫ్ట్‌ను తయారు చేసింది. ఇది గగన తలాన్ని చేరుకోగానే.. సూర్యుని నుండి వచ్చే కిరణాలు దాని క్రింది వైపున ప్రతిబింబించేలా చేసి ఇతరులకు కనబడకుండా చేస్తుంది. అది రష్యా యుద్ద విమనాల రాడార్లకు చిక్కకుండా చేస్తుంది. 1950  నుండి 1960 మధ్య కాలంలో అప్పడే పరీక్షల కోసం బయటకు వచ్చిన యు-2 రహస్య యుద్ద విమానాన్ని చూసిన ప్రజలు అది ఏలియన్‌గా భావించారు. ఆర్థిక, సాంకేతిక, యుద్ద రంగాలతో పాటు దాదాపు అన్ని అంశాల పరంగా ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా ఈ ప్రాంతాన్ని అత్యంత రహస్యంగా ఉంచి ఊహకందని ప్రయోగాలు ఇంకా చేస్తూనే ఉంది.

ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి...

For All Tech Queries Please Click Here..!