హైదరాబాదులో 9 రోజుల్లో 545 మంది బాలికల అదృశ్యం... అసలేం జరుగుతోంది?

Wednesday, June 12, 2019 11:08 AM News
హైదరాబాదులో 9 రోజుల్లో 545 మంది బాలికల అదృశ్యం... అసలేం జరుగుతోంది?

అభం శుభం తెలియని చిన్నారులు అదృశ్యమవుతున్నారు. చిన్నారులే కాదు మధ్య వయసు వారు, వృద్ధులు సైతం కనిపించకుండా పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల్లో 545 మంది అదృశ్యమయ్యారు అంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రాజధాని హైదరాబాద్ పరిసరాల్లోనే 296 మంది అదృశ్యమయ్యారు. ఎక్కువగా ఆడపిల్లలు అదృశ్యమవుతున్నారు. చిన్నారులు అదృశ్యం అవుతున్నారని ఫిర్యాదు చేసినా పోలీస్ వ్యవస్థ సరైన చెర్యలు తీసుకోవటలేదు అనే వదంతులు వినిపిస్తున్నాయి. తమ పిల్లలు అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేసినా లాభం లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. తాజా లెక్కల ప్రకారం రోజుకు సగటున 60 మంది తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యం అవుతున్నారు. అదృశ్యమవుతున్న వారిలో ఆడపిల్లలే ఎక్కువగా ఉండటం గమనార్హం, అదృశ్యమవుతున్న వారిలో 18 నుండి 40 ఏళ్ల వయసు వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

జూన్ నెల మొదటి వారం లోనే రాష్ట్రంలో 545 మంది అదృశ్యమై కేసులు నమోదయ్యాయి, నమోదు కాని కేసులు ఎన్నో ఉన్నాయి మనం అంచనా వేసుకోవచ్చు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 296 మంది కనిపించకుండా పోయారు అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నానాటికీ మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అటు పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. ప్రధానంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని పిల్లలే మిస్సింగ్ కు గురవుతున్నారు. పోలీసులు ఈ విషయాన్ని త్వరగా ఛేదిస్తారని అనుకుందాం.

For All Tech Queries Please Click Here..!