కరోనా వ్యాపించకుండా కంచె వేసిన గ్రామీణులు

Thursday, March 26, 2020 09:13 AM News
కరోనా వ్యాపించకుండా కంచె వేసిన గ్రామీణులు

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ బుధవారం విజయవంతంగా అమలైంది అని ప్రభుత్వం తెలిపింది ఇలానే మరో 20 రోజులు చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తూ గృహాలకే పరిమితమయ్యారు. ఒకరిద్దరు తప్ప రోడ్ల మీదకు పెద్దగా రాలేదు. తమ గ్రామాల్లోకి ఇతరులెవరూ రావడానికి వీల్లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల ప్రజలు రోడ్లను దిగ్బంధనం చేశారు. గ్రామ పొలిమేర్లలో రోడ్డుకు అడ్డంగా ముళ్లకంప, బండరాళ్లు, వాహనాలను అడ్డుపెట్టారు. ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ గ్రామంలోకి రాకుండా, తమ గ్రామస్తులు బయటకు పోకుండా నియంత్రించారు.  

తూర్పుగోదావరి జిల్లా అమలాపు రం పట్టణంలోని గాంధీనగర్, విత్తనాలవారి కాల్వగట్టు, కామనగరు వు, మెట్ట ప్రాంతం కిర్లంపూడి, గోకవరం, రంపచోడవరం ఏజెన్సీ లోని పలు గ్రామాల్లో ప్రజలు.. ఇతరులను తమ ప్రాంతాల్లోకి రానీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలోని గిరిజన పల్లెలు ప్రత్యేకంగా సమావేశమై తమ గ్రామంలోకి రాకుండా ఇతరులను అడ్డుకోవాలంటూ ఏకంగా తీర్మానం చేశారు. వంతులు వారీగా సరిహద్దుల్లో కాపలా పెట్టారు.  

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండపాలెం, కురిచేడు మం డలం వంగాయపాలెం తదితర గ్రామాల్లోని ప్రజలు తమ గ్రా మ పొలిమేర్ల వద్ద రహదారులపై ముళ్ల కంప వేశారు. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.  
ఇలా ప్రతి మండలంలో జరుగుతుంది.

Topics: