ఇది అమెరికాయేనా అన్నంత రీతిలో అక్కడ పరిస్థితి...!

Sunday, April 5, 2020 09:27 AM News
ఇది అమెరికాయేనా అన్నంత రీతిలో అక్కడ పరిస్థితి...!

అమెరికాలో మొట్టమొదట సారిగా కరోనా మహమ్మారి బారినపడిన వాషింగ్టన్‌ రాష్ట్రంలో కేసుల తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల మాత్రమే ఇది సాధ్యమయిందని అక్కడి అధికారులు అంటున్నారు. కరోనా కేసులలో తొలి స్థానం నుంచి పదో స్థానానికి వచ్చింది. శనివారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల జాబితాను పరిశీలిస్తే వాషింగ్టన్‌ స్టేట్‌ పదో స్థానంలో నిలిచింది. మార్చి మాసంలో 3,250 కేసులతో మొదటి స్థానంలో ఉన్న వాషింగ్టన్‌ స్టేట్‌ ఇప్పుడు 6,966 కేసుల దగ్గర ఆగిపోయింది.

అప్పుడు వంద కంటే తక్కువ కేసులు నమోదయిన న్యూయార్క్, న్యూజెర్సీ ఇప్పుడు కరోనా కేసుల లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాయి. తాజాగా న్యూయార్క్‌లో 1,03,476, న్యూజెర్సీలో 29,895 కేసులు నమోదయ్యాయి. మార్చి మూడో వారంలో 5 వేల కేసులతో రెండో స్థానంలో ఉన్న కాలిఫోర్నియా ఇప్పుడు 12,581 కేసులతో మూడు స్థానంలో ఉంది. వాషింగ్టన్‌ ప్రభుత్వానికి, పోలీసులకు అక్కడి ప్రజలు సంపూర్ణంగా సహకరించడం వల్లే కేసులు పెరగలేదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా రివర్‌సైడ్‌ కల్చరల్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ టోబీ మిల్లర్‌ అన్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: