తీర్పు ముగిసింది...ఫలితమే తరువాయి...

Saturday, December 8, 2018 08:12 AM News
 తీర్పు ముగిసింది...ఫలితమే తరువాయి...

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు వరకు జరిగింది. ఓటు వేయడానికి జనాలు అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌‌ బూత్‌లకు బారులు తీరారు.  కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఘటనలు తప్ప మిగిలిన అన్ని చోట్లా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది.  సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం కుడకుడలో మాత్రం సాయంత్రం ఐదు గంటల వరకూ కూడా జనాలు పెద్ద ఎత్తునే బారులు తీరారు. హైదరాబాద్‌‌లో పోలింగ్ పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణాల్లో మరీ తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదైందన్నది మీడియా సమావేశం నిర్వహించి సీఈవో రజత్‌‌కుమార్ వివరాలు వెల్లడించనున్నారు. మొత్తానికి చూస్తే 60%పైగా పోలింగ్ శాతం నమోదైందని తెలుస్తోంది.  డిసెంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి.