ఈవీఎంతో సెల్ఫీ దిగి కటకటాలపాలైన యువకుడు

Friday, December 7, 2018 12:50 PM News
ఈవీఎంతో సెల్ఫీ దిగి కటకటాలపాలైన యువకుడు

ఓటు వేసిన తరువాత సిరా చుక్క అంటిన వేలు కనబడేలా సెల్ఫీ దిగి ఫేస్‌బుక్‍‌‌లో పోస్ట్ చేయడం సహజంగా చూస్తుంటాం. కానీ ఓ యువకుడి ఎంతో సాహసం చేసి పోలింగ్ బూత్‌లో ఈవీఎంతో సెల్ఫీ దిగాడు. ఫోటో దిగిన యువకుడు ఈ వెంటనే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. వేసే ప్రతి ఓటు గోప్యంగా ఉంచాలని ఎలక్షన్ కమీషన్ ఇలాంటి చట్టవిరుద్దమైన పనులు చేసే వార ఆటకట్టించేందుకు తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో కూడా ఓ ప్రత్యేక బృందంతో నిఘా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని ఉప్పర పల్లికి చెందిన శివగౌడ్‌ ఫోటో అలా అప్లోడ్ చేయగానే సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

నిజానికి పోలింగ్ బూతులోకి సెల్ ఫోన్లను అనుతించలేదు మరియు ఫోటోలు, సెల్ఫీలు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఇదివరకే స్పష్టం చేశారు. శివగౌడ్ సెల్‌ఫోన్ బూతులోనికి తీసుకెళ్లడంతో అధికారుల నిర్లక్ష్యం కూడా బయటపడింది.