ఈ 13 కార్డుల్లో ఏది ఉన్నా ఓటేయవచ్చు

Thursday, December 6, 2018 07:14 PM News
ఈ 13 కార్డుల్లో ఏది ఉన్నా ఓటేయవచ్చు

రేపు ( డిసెంబరు 07) జరగనున్న తెలంగాణ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికలకు 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అంవాచనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు విభాగం కూడా పక్కా ప్రణాళికతో సిద్దమైంది.

ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంకాలం 5 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అనుమతిస్తారు. 5 గంటల తరువాత వచ్చే ఓటర్లను అనుమతించరు. ప్రజలంతా వీలైనంత ముందుగానే వచ్చి ఓటు వేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.

ఓటరు కార్డు ఉంటేనే ఓటు వేయడానికి అనుమతిస్తారు అని చాలా మందికి అపోహ ఉంది. కానీ, ఎన్నికల సంఘం నూతన నియమావళి ప్రకారం ఓటరు లిస్టులో పేరు ఉండి... ఓటరు కార్డు లేకపోయినా సరే 13 రకాల ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపించి ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా మద్యం సేవించి ఓటు వేసేందుకు వచ్చే వారిని పోలింగ్ బూతులోకి అనుమతించబోమని ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్ పేర్కొన్నారు..

ఓటింగ్ కోసం అనుమతించే ఇతర గుర్తింపు కార్డులు:
1. ఆధార్ కార్డు
2. డ్రైవింగ్ లైసెన్స్
3. పాస్‌పోర్ట్
4. ఉపాధి హామీ పథకం కార్డు
5. పాన్ కార్డు
6.ఆరోగ్య భీమా కార్డు
7. బ్యాంకు పాసు పుస్తకం
8. పోస్టాఫీసు పాసు పుస్తకం
9. ఆర్‌జీఐ జారీ చేసిన ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డు
10. ఫోటో గల పెన్షన్ డాక్యుమెంట్
11. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఫోటోతో కూడిన ఓటర్ స్లిప్పు
12. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు ఐడి కార్డు
13. ఎంపీ, ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీల గుర్తింపు కార్డు

For All Tech Queries Please Click Here..!