ఆయన ఓటు విలువ లక్షా 80 వేలు!

Saturday, December 8, 2018 11:26 PM News
ఆయన ఓటు విలువ లక్షా 80 వేలు!

ఓటు వేయాలంటే నాకేం ఇస్తావో చెప్పు.. అని ఆశించే ఈ రోజుల్లో కేవలం ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు శ్రీనివాస్. అమెరికా నుంచి వచ్చి ఓటు వేయడానికి శ్రీనివాస్‌కు అయిన ఖర్చు ఎంతో తెలుసా...? అక్షరాలా లక్షా ఎనభైవేల రూపాయలు. తన సొంత ఖర్చుతో వచ్చి ఓటు వేశాడు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన బోలిగోర్ల శ్రీనివాస్  వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఓటు వేయడానికి అమెరికా నుంచి రావడంతో గ్రామస్తులు శ్రీనివాస్‌ను కొనియాడారు.

శ్రీనివాస్ మాత్రమే కాదు... విదేశాల్లో స్థిరపడిన ఎంతో మంది తెలంగాణ వాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత వ్యయాలతో ఇండియాకొచ్చి తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటు వేశారు. రాష్ట్రంలో ఉండి ఓటు వేయని ప్రజలకు ఇదొక చెంప పెట్టు అని చెప్పుకోవచ్చు.