విమానం నుంచి ఇందనం లీక్: కోల్‌కతాలో అత్యవసరంగా స్పైస్‌జెట్ ల్యాండ్,

Wednesday, February 26, 2020 11:53 AM News
విమానం నుంచి ఇందనం లీక్: కోల్‌కతాలో అత్యవసరంగా స్పైస్‌జెట్ ల్యాండ్,

ముంబై నుంచి గువహటి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఇందనం లీకవుతోంది. దీనిని గుర్తించిన పైలట్వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందజేశారు. దీంతో కోల్‌కతా సిబ్బంది స్పందించి, విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. విమానం నుంచి ఇందనం లీకవుతోందని తెలిసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. కానీ సురక్షితంగా ప్లైట్ దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు.బుధవారం ఉదయం 9 గంటలకు కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యిందని అధికారులు వివరించారు. ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.

For All Tech Queries Please Click Here..!