నిరవధిక సమ్మెలోకి డీలర్లు

Saturday, December 15, 2018 11:10 PM News
నిరవధిక సమ్మెలోకి డీలర్లు

కమీషన్‌ వద్దని, గౌరవ వేతనం చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో చౌకధరల దుకాణాల డీలర్లు ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. అయితే.. సమ్మెలోకి వెళితే లైసెన్స్‌ రద్దు చేస్తామన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు భయపడేది లేదని, 16 నుంచి సమ్మెలోకి వెళ్లి తీరతామని డీలర్ల సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు. జనవరి కోటా సరుకుల పంపిణీకి డీడీలు కట్టే ప్రసక్తే లేదని, క్రిస్మస్‌ కానుకలు కూడా పంపిణీ చేయబోమని అంటున్నారు.