విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలు తారుమారు.

Saturday, April 4, 2020 08:37 AM News
విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలు తారుమారు.

లాక్‌డౌన్‌ కొనసాగుతూ ఉండటంతో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్‌ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయి నివేదికలపై శుక్రవారం సమీక్షించిన ఉన్నతాధికారులు ఇందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ వేసవిలో రోజుకు విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు 210 మిలియన్‌ యూనిట్లు ఉండొచ్చని జనవరిలో అంచనా వేశారు. అయితే కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌తో విద్యుత్‌ వినియోగం అంచనాలన్నీ తారుమారయ్యాయి. వారం రోజులుగా గరిష్ట విద్యుత్‌ వినియోగం రోజుకు 160 మిలియన్‌ యూనిట్లు దాటడం లేదు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి వ్యవసాయ వినియోగం కూడా తగ్గుతుంది. దీంతో రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ 125 మిలియన్‌ యూనిట్లకు తగ్గే వీలుంది. దీంతో వీలైనంత వరకూ విద్యుత్‌ లభ్యతను తగ్గించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

  1.  రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి కలిపి మొత్తం 185 మిలియన్‌ యూనిట్ల లభ్యత ఉంది. మరో 20 మిలియన్‌ యూనిట్లు మార్కెట్లో చౌకగా లభించే అవకాశం ఉంది.  
  2.  డిమాండ్‌ తగ్గడంతో ఉత్పత్తి కంపెనీల న్నింటికీ డిస్కమ్‌లు వేగంగా ఫోర్స్‌మెజర్‌ నోటీసులు ఇస్తున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఫోర్స్‌మెజర్‌ ఉపయోగపడుతుంది.  
  3.  లాక్‌డౌన్‌ తీసేస్తే వాణిజ్య, పారిశ్రామిక డిమాండ్‌ పెరిగే వీలుంది. రాష్ట్రంలో 35 మిలియన్‌ యూనిట్ల వరకూ వ్యవసాయ విద్యుత్‌ వాడకం ఉంది. ఇది తగ్గుతుంది కాబట్టి వాణిజ్య అవసరాలు పెరిగినా పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: