సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన పాప చేసిన విజ్ఞప్తి

Thursday, March 26, 2020 09:20 AM News
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన పాప చేసిన విజ్ఞప్తి

మా నాన్న పోలీస్, కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు సహకరించండి అంటూ ఓ పసిపాప ప్లకార్డు పట్టుకున్న పోస్టు ఇపుడు వైరల్‌గా మారింది. కదిలించే లా ఉన్న ఈ తరహా ఫొటోలను చాలామంది ట్విట్టర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేస్తున్నారు. ఇక డీజీపీ సైతం రోడ్లపైకి ప్రజలు రాకుండా పోలీసులకు సహకరించాలని విజ ్ఞప్తి చేస్తున్నారు.

వివరాల లోకి వెళితే కోవిడ్‌ మహమ్మారిపై కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులకు ఒక్కసారిగా పని భారం పెరిగింది. ఆదివారం జనతా కర్ఫ్యూ దరిమిలా పోలీసులకు విరామం లేకుండా పోయింది. జనసంచారంపై సోమవారం మధ్యాహ్నం వరకు కాస్త చూసీచూడనట్లుగా ఉన్నా తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారింది. అప్పటి నుంచి పోలీసులు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. మంగళవారం ప్రధాని 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ఉంటుం దని ప్రకటించడంతో పోలీసుల పనిభారం రెట్టింపయింది. అత్యవసర పరిస్థితి కావడంతో వారి సెలవులన్నీ రద్దయ్యాయి.

కోవిడ్‌పై జరుగుతున్న యుద్ధంలో పోలీసులది కీలక భూమిక. ముఖ్యంగా కోవిడ్‌ బాధితుల గుర్తించడం, ప్రజలను చైతన్యం చేయడం, గ్రామపంచాయతీ, రెవెన్యూ, ప్రజాప్రతినిధులతో కలిసి గత మూడురోజులుగా నిర్విరామంగా పనిచేస్తున్నారు. పలువురు కోవిడ్‌ అనుమానితులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు ఏ అర్ధరాత్రో ఇంటికి వెళ్లి వస్తున్నారు కానీ కానిస్టేబుళ్లలో చాలామంది ఇంటికి వెళ్లి నాలుగురోజులయింది. చాలామంది స్నానం చేయకుండా, యూనిఫారం మార్చుకోకుండా రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తోన్న పోలీసుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జనసంచారం నియంత్రణలో పడి ఎక్కడ ముందు జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారో అన్న ఆవేదనలో మునిగిపోయారు.

Topics: