రోజు 12 గంటలు పని, నెలకు 7 వేలు జీతం... ప్యార్లేజీ కంపెనీలో బాలకార్మికుల వ్యధ..!

Sunday, June 16, 2019 12:26 PM News
రోజు 12 గంటలు పని, నెలకు 7 వేలు జీతం... ప్యార్లేజీ కంపెనీలో బాలకార్మికుల వ్యధ..!

పార్లే జీ, మన అందరికి తెలిసిన బిస్కట్ల బ్రాండ్, జీ అంటే జీనియస్ అంటూ యాడ్లు ఇస్తుంటారు. చిన్న పిల్లలకు పోషకాహారం అందిస్తామని పెద్ద పెద్ద స్పీచులు ఇస్తుంటారు, కానీ ఆ బిస్కట్లను తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తుంది మాత్రం చిన్న పిల్లలు. ఛత్తీస్ గఢ్‌లోని రాయ్‌పూర్ పార్లే జీ ప్లాంట్ నుంచి బాల కార్మికులను ఆ రాష్ట్ర కార్మికశాఖ కాపాడటం విస్మయానికి గురిచేసింది. పిల్లలను తినమనే చెప్పే బిస్కెట్లు తయారుచేస్తుంది కూడా చిన్న పిల్లలే.

వివరాలలోకి వెళితే రాయ్పూర్ పార్లే జీ ప్లాంట్ నుంచి 26 మంది బాల కార్మికులను కాపాడామని ఛత్తీస్గఢ్‌ కార్మికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడి ప్లాంటులో చిన్న పిల్లలు పని చేపిస్తున్నారుఅని పక్కా సమాచారం అందుకున్న  అధికారులు పోలీసుల సహాయంతో ప్లాంట్లో తనికీలు చేసి 26 మంది చిన్నపిల్లలని కాపాడారు. ఫ్యాక్టరీ నుంచి రక్షంచిన పిల్లలను జువైనల్ హోంకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదుతో ఫ్యాక్టరీ యాజమానిపై ఫిర్యాదు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేశామని పేర్కొన్నారు. బాలల వయస్సు 13 ఏళ్ల నుంచి 17 సంవత్సరాలు ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

For All Tech Queries Please Click Here..!