నిలిచిపోనున్న ఎన్టీఆర్‌ వైద్య సేవ

Sunday, December 16, 2018 05:41 PM News
నిలిచిపోనున్న ఎన్టీఆర్‌ వైద్య సేవ

ఎన్టీఆర్‌ వైద్య సేవలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాల్టీ ఆస్పత్రుల అసోసియేషన్‌ పేర్కొంది. అయితే అత్యవసర వైద్య సేవలను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపింది. 450 ఆస్పత్రులకు రూ.500 కోట్లకుపైగా ప్రభుత్వం బకాయిపడింది... దీంతో ఎన్టీఆర్‌ వైద్య సేవలను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్‌ ప్రకటించింది.