ముద్ర‌ణ‌ ఆపేసిన దిన‌ప‌త్రిక‌లు..!

Wednesday, April 1, 2020 10:08 AM News
ముద్ర‌ణ‌ ఆపేసిన దిన‌ప‌త్రిక‌లు..!

ఆస్ట్రేలియాలో సుమారు అన్ని ప్రాంతీయ దిన‌ప‌త్రిక‌లు ముద్ర‌ణ‌ను నిలిపివేశాయి. కరోనా వైర‌స్ వ‌ల్ల ప్రింట్ ఎడిష‌న్‌ను ఆపివేస్తున్న‌ట్లు ఆ న్యూస్‌పేప‌ర్లు వెల్ల‌డించాయి. మీడియా గ్రూపు న్యూస్ కార్ప్ ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. అయితే ఆన్‌లైన్‌లో వెబ్ సైట్ ద్వారా మాత్రం త‌మ వార్త‌లు ఉంటాయ‌ని ఆ ప‌త్రిక‌లు పేర్కొన్నాయి.

ఇదేమీ చిన్న నిర్ణ‌యం కాదు అని, ఇప్ప‌టికే ప్రింట్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ని అని అన్నారు, పేపర్లో అడ్వ‌ర్ట‌యిజింగ్ కూడా ప‌డిపోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేద‌ని ఆస్ట్రేలియా న్యూస్ కార్ప్ చీఫ్ మైఖేల్ మిల్ల‌ర్ తెలిపారు. ఇప్పటికే కరోనా వలన ఆస్ట్రేలియా బాగా ఇబందిపడుతున్న విషయం మనకి తెలిసిందే.

For All Tech Queries Please Click Here..!
Topics: