ముంబై హాస్పిటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం

Monday, December 17, 2018 10:57 PM News
ముంబై హాస్పిటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం

ముంబైలోని అందేరీ ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఘర్ హాస్పిటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆరు మంది మరణించగా.. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. ఆసుపత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో విపత్తు నిర్వహణ సిబ్బంది అతి కష్టం మీద అక్కడికి చేరుకుని రోగులను మరియు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.