వంగపండు వేషధారణలో ఎంపీ శివప్రసాద్

Tuesday, December 18, 2018 03:30 PM News
వంగపండు వేషధారణలో ఎంపీ శివప్రసాద్

ఏపీకి న్యాయం చేయాలంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతీ రోజు పలు రకాల వేషధారణలతో పార్లమెంటుకు వస్తున్న ఎంపీ ఈరోజు జానపద కళాకారుడు వంగపండు వేషంలో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న మోదీ ఎన్నికలయ్యాక అన్నీ మరిచాడంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా రైల్వేజోన్ ఇతర హామీలను మరిచిన మోదీని ఓడించడానికి కదిలి రావాలంటూ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారంటూ జానపదాలు పాడుతూ శివప్రసాద్ నిరసనను తెలియజేశారు.