మోడీ నోట సారీ మాట, ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియో

Saturday, October 12, 2019 03:00 PM News
మోడీ నోట సారీ మాట, ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియో

అగ్రరాజ్యం అమెరికాలో మోడీ పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత (Shared dreams Bright futures) పేరుతో టెక్సాస్‌ ఇండియా ఫోరం నిర్వహించిన హౌడీ మోడీ (Howdy Modi)అనుకున్నదానికంటే ఘనంగా విజయవంతమైంది. ఈ ఈవెంట్ ఆది నుంచి మోడీ నినాదాలతో మార్మోగిపోయింది. హౌడీ మోడీ ఈవెంట్ ద్వారా ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింతగా బలపడింది. ఈ ఈవెంట్లోనే మోడీ సారీ అనే పదాన్ని వాడారు. అయితే అది సరదా సంభాషణలో మాత్రమే.. హూస్టన్ లో ప్రధాని మోడీ గౌరవార్థం జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ సహా అనేకమంది యుఎస్ ఎంపీలు, గవర్నర్లు హాజరయ్యారు. వీరిలో జాన్ కార్నిన్ అనే సెనేటర్ కూడా ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ కి హాజరైనందున ఆయన తన భార్య శాండీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయారు. 

ఈ సందర్భంగా సెనెటర్‌ భార్యకు మోడీ క్షమాపణలు చెప్పారు. దీనికి కారణం ఆదివారం కార్నిన్‌ భార్య పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో మోదీ కార్నిన్‌ భార్యను ఉద్దేశిస్తూ.. ‘నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఈ రోజు మీ పుట్టినరోజు.. కానీ అనివార్య కారణాల వల్ల ఈ రోజు మీ భర్త నాతో ఉండాల్సి వచ్చింది. అందుకు నన్ను క్షమించండి. ఇది మీకు ద్వేషాన్ని కలిగించవచ్చు’ అన్నారు. ఆ సందర్భంలో మోడీ పక్కనే జాన్ కూడా ఉన్నారు. వారిద్దరి జీవితాలు సంతోషంగా సాగాలని.. కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. వీడియో తాలూకు ట్వీట్ ను ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అవుతుంది.ఈ పోస్టుకు 13వేలకు పైగా లైక్స్, 2000కు పైగా రీట్వీట్లు వచ్చిపడ్డాయి. జాన్ కార్నిన్ దంపతులది 40 ఏళ్ళ వైవాహిక జీవితం. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

ఐదు కుటుంబాలను భారత్‌కు పంపండి: మోదీకార్యక్రమానికి హాజరైన భారతీయులను ఉద్దేశిస్తూ మోడీ ‘ఈ వేదిక మీదుగా నేను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల్ని ఓ చిన్న కోరిక కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు.. ఆయ దేశాలకు చెందిన ఐదు కుటుంబాలను ఇండియా పర్యటనకు పంపండి’ అని కోరారు. 

ఇదిలా ఉంటే పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో మరోమారు చాటిచెప్పారు. హ్యూస్టన్​లోని జార్జ్​ బుష్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చిన్న సంఘటన అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో అమెరికా ప్రతినిధి ఒకరు ప్రధాని మోదీకి పుష్పగుచ్చం అందించగా.. అందులోంచి కొన్ని పూలు కిందపడిపోయాయి. అందరిని ఆశ్చర్యపరుస్తూ మోదీ కిందికి వంగి స్వయంగా ఆ పూలను తీసి సిబ్బందికి అందించారు. ఈ అంశం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది.

For All Tech Queries Please Click Here..!