మోడీ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఊరట

Friday, December 14, 2018 04:37 PM News
మోడీ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఊరట

రఫెల్ ఒప్పందం కేసులో మోడీ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ డీల్ పై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశించాలంటు గతంలో దాఖలైన పిటీషన్ పై తాజాగా సర్వోన్నత న్యాయస్తానం కొట్టేసింది. రఫెల్ డీల్ పై దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. యుద్ద విమానాల ధరలను నిపుణుల కమిటీ చూసుకుంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దేశ రక్షణ దృష్ట్యా వీటి సమాచారాన్ని రహస్యంగా ఉంచాలని కోర్టు పేర్కొంది. రఫెల్ జెట్స్ ధరలను బయటకు చెప్పడం మంచిదికాదన్న కేంద్రం వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రఫెల్ జెట్స్ ధరలను బహిర్గతం చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. వైమానికదళ ఆధునికీకరణ కోసం ఫ్రాన్స్ నుంచి సుమారు 36 యుద్ద విమానాలను కొనుగోలు చేయడానికి యూపీఏ హాయాంలో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 58వేల కోట్ల విలువైన ఈ డీల్ లో రిలయన్స్ సంస్థకు లబ్దిచేకూరేలా మోడీ సర్కార్ అవకతవకలకు పాల్పడిందంటూ జాతీయ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కొద్దికాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ప్రధాని మోడీనే ప్రధాన దోషి అని కాంగ్రెస్ ఛీఫ్ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.