డిఎస్‌సి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

Monday, December 17, 2018 08:33 PM News
డిఎస్‌సి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

ఉపాధ్యాయ నియామకానికి సంబంధిం చిన డిఎస్‌సి పరీక్షా షెడ్యూల్‌లో పాఠశాల విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. తేదీల వారీగా, పోస్టులు వారీగా నిర్వహించనున్న షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. నవంబర్‌ 28న ప్రకటించిన షెడ్యూల్‌లోనే ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. డిసెంబర్‌ 24,26,26, 27,28 తేదిల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పిజిటి పోస్టులకు డిసెంబర్‌ 28,29,30,31 తేదిల్లో టిజిటి పోస్టులకు ఈ నెల 31, జనవరి 1,2 తేదిల్లో జనవరి 2న పిఇటిలకు భాషా పండితులకు జనవరి 3న, ప్రిన్సిపాల్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌ పోస్టు లకు జనవరి 4న పరీక్షలు జరగనున్నాయి.