పెథాయ్ తుఫాన్ : ఇరుక్కుపోయిన మంత్రి కారు

Monday, December 17, 2018 07:00 PM News
పెథాయ్ తుఫాన్ : ఇరుక్కుపోయిన మంత్రి కారు

ఉత్తరాంధ్రాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న పెథాయ్ తుఫాన్ కాట్రేనికోన వద్ద తీరం దాటింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు కారు తీరంలో ఇసుకలో ఇరుక్కుపోయింది. భీమిలి బీచ్ దగ్గర్లోని మంగమర్రిపేట వద్ద తీరంలో గంటా కారు ఇసుకలో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన రక్షణ సిబ్బంది కారును బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.