వైరస్‌ జన సమూహంలోకి వెళ్లిందా?

Thursday, April 2, 2020 09:01 AM News
వైరస్‌ జన సమూహంలోకి వెళ్లిందా?

రాష్ట్రంలో కరోనా మేఘాలు కమ్ముకున్నాయి. ఐదారు రోజుల క్రితం వరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా పాజిటివ్‌ రావడం, వారి ద్వారా వారి ఫ్యామిలిలో మాత్రమే ఇంకొందరికి అంటుకోవడం అంతర్జాతీయ విమాన సర్వీసులు, అంతర్గత సర్వీసులు నిలిచిపోవడం ఇక ఏం పర్వాలేదని ఊపిరి పీల్చుకుం టుండగా ఉన్నట్టుండి రాష్ట్రంలో  మర్కజ్‌ బాంబు పేలింది. విదేశాల నుంచి వచ్చిన వారికంటే, ఇప్పుడు అత్యంత వేగంగా ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచే కరోనా వ్యాప్తి విస్తృతమవుతోంది.

తెలంగాణ నుంచి 1,030 మంది ప్రతినిధులు మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారని వైద్య ఆరోగ్యశాఖే నిర్ధారించింది. వీరిలో 160 మందిని తప్ప అందరినీ గుర్తించారు. అయితే ఈ వెయ్యి మంది సరాసరి పది మంది చొప్పున 10 వేల మందితో కాంటాక్ట్‌ అయ్యుంటారని అంచనా. ఉదాహరణకు సచివాలయ ఉద్యోగి ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని వారం పది రోజులు విధులు నిర్వహించారు. అతను ఈ 10 రోజుల్లో వంద మందితో కాంటాక్ట్‌ అయినట్టు అంచనా. అయితే, అతడికి నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లేకుంటే సెక్రటేరియట్‌లో చాలామంది ఐసోలేషన్‌కు, పరీక్షలకు వెళ్లాల్సి వచ్చేది.

ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న బృందంలో అన్ని జిల్లాలకు చెందినవారు ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారి ద్వారా నేరుగా కాంటాక్టయిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను కలిపితే పది వేల మందికి పైగా అవుతారనే అంచనా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో కొందరు మినహా మిగిలిన వారిని గుర్తించింది. కానీ వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను గుర్తించి వారిలో ఏవైనా కరోనా అనుమానిత లక్షణాలున్నాయో లేదో మాత్రం తెలుసుకోలేకపోతోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: