దటీజ్ ఇండియా: అటు అమెరికా, జపాన్.. ఇటు రష్యా, చైనా

Saturday, December 1, 2018 07:44 AM News
దటీజ్ ఇండియా: అటు అమెరికా, జపాన్.. ఇటు రష్యా, చైనా

బ్యూనస్ ఎయిర్స్: కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా గమనించొచ్చు. గతంతో పోలిస్తే.. నాలుగేళ్లుగా విదేశీ వ్యవహారాల్లో భారత్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవల చైనా దూకుడును అడ్డుకోవడం కోసం మన దేశం అమెరికాకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరకాల మిత్ర దేశం రష్యాకు కూడా మనం కాస్త దూరం కావాల్సి వచ్చింది. కానీ మోదీ సర్కారు అనుసరిస్తోన్న వ్యూహాత్మక విదేశాంగ విధానం కారణంగా.. చైనా, రష్యాలకు భారత్ తిరిగి స్నేహ హస్తం అందించింది. 

అర్జెంటీనాలో జరుగుతోన్న జీ20 సదస్సు సందర్భంగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ మూడు దేశాలు 12 ఏళ్ల క్రితం తొలిసారి సమావేశం కాగా.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రెండో దఫా భేటీ అయ్యాయి. భారత్, చైనా మధ్య ఇటీవల సంబంధాలు మెరుగుపడటాన్ని ఈ సమావేశం సూచికగా భావించొచ్చు. బ్రిక్స్ దేశాలుగా చలామణి అవుతోన్న బ్రెజిల్, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలు ఏటా సమావేశం అవుతూ పరస్పరం సహకరించుకుంటున్న సంగతి తెలిసిందే. 

For All Tech Queries Please Click Here..!