భారీ ఉపగ్రహ ప్రయోగం...ఎందుకంటే...

Tuesday, December 4, 2018 12:06 PM News
భారీ ఉపగ్రహ ప్రయోగం...ఎందుకంటే...

దేశ సమాచార, ఇంటర్నెట్‌ రంగం బలోపేతం కోసం ఇస్రో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఫ్రెంచ్‌ గయానా నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. అక్కడి కురు అంతరిక్ష కేంద్రం నుంచి ఆ దేశపు ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా 5,854 కిలోల జీశాట్‌-11 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం తెల్లవారుజామున 4.08 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. 

ఈ ఉపగ్రహాన్ని ఏరియన్‌ రాకెట్‌ తాత్కలిక భూసమస్థితి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. అనంతరం మనశాస్త్రవేత్తలు బెంగుళూరులోని హసన్‌ కేంద్రం నుంచి ఉపగ్రహంలోని ద్రవ అపోజీ మోటార్లను మండించి భూమధ్య రేఖకు తూర్పుదిశలో 74డిగ్రీలవాలులో భూస్థిరకక్ష్యకు చేరవేయనున్నారు.  ఈ ఉపగ్రహంలో దేశ సమాచార వ్యవస్థ కోసం 32 కేయు బాండ్‌తోపాటు 8 కేఏబాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లను ఏర్పాటు చేశారు.  ఈ ఉపగ్రహంలోని మల్టీ స్పాట్‌ బీమ్‌ యాంటీనా మనదేశ వ్యాప్తంగా సంకేతాలు అందించనుంది. నిమిషానికి 16 గెగాబైట్స్‌ వేగాన్ని ఇంటర్నేట్‌కు అందించనుంది. దేశంలో గ్రామ పంచాయతీలలో ఈ-గవర్నె్‌సకు ఉపయోగపడనుంది. బ్రాడ్‌బాండ్‌ సర్వీసె్‌స్సలలో కీలక పాత్ర పోషించనున్నది. 15 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది.

For All Tech Queries Please Click Here..!