విజయవాడలో తొలి కరోనా మరణం, 30వ తేదీ నాడే మృతి, షాకింగ్ ట్విస్టులు !

Friday, April 3, 2020 02:11 PM News
విజయవాడలో తొలి కరోనా మరణం, 30వ తేదీ నాడే మృతి, షాకింగ్ ట్విస్టులు !

రాష్ట్రంలో కరోనా వైరస్ భయానకంగా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తొలి మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మరణానికి ఢిల్లీలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలే ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మృతుడి కుమారుడు ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని తిరిగి ఇక్కడకి వచ్చిన తరువాత వైరస్ బారిన పడ్డారు. కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సంక్రమించి ఉంటుందని, దీని బారిన పడిన రోజే ఆయన మరణించారని చెప్పారు.

వివరాలలోకి వెళితే మృతుడి పేరు సుభాని అతని వయస్సు 55 సంవత్సరాలు. విజయవాడ దగ్గరలోని కుమ్మరిపాలెంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కిందటి నెల 30వ తేదీన సోమవారం నాడు ఆయన అస్వస్థతకు గురిఅవ్వటంతో చికిత్స కోసం అదే రోజు ఉదయం విజయవాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలను నిర్వహించిన గంట వ్యవధిలోనే.  ఆయన మరణించారు. హైబీపీ, డయాబెటిస్ కార్డియాక్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఆయనకు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మృతుని కుమారుడు కిందటి నెల ఢిల్లీలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అదే నెల 17వ తేదీన ఆయన స్వస్థలానికి చేరుకున్నారు. కొద్దిరోజుల తరువాత ఆయన తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడ్డారు. ఈ నెల 31వ తేదీన ఆయనను విజయవాడ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

తండ్రి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో మరణించిటంతో, ఆయన కుటుంబ సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా కుమారుడికి పాజిటివ్‌గా తేలింది. తండ్రి మరణించడానికి ముందే కుమారుడు వైరస్ బారిన పడ్డారని, ఆయన నుంచి తండ్రికి కరోనా సోకి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.మృతుడు సుభానికి హైబీపీ, డయాబెటిస్ కార్డియాక్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉండటం వలన దేని వలన మరణించాడు అని చెప్పడానికి వైద్యులకు 4 రోజులు పట్టింది.

For All Tech Queries Please Click Here..!
Topics: