నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

Thursday, January 31, 2019 12:05 AM News
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఎగ్జిబిషన్ కు వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. మంటలు క్రమంగా స్టాల్స్ కు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. కొద్దిసేపట్లో మంటలు పూర్తిగా వ్యాపించడంతో తొక్కిసలాట జరిగింది. గ్జిబిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఆంధ్రా బ్యాంకు స్టాల్ నుంచి మంటలు రేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగినట్లు తెలిసింది.

హైదరాబాద్‍‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నుమాయిష్‌లోని ఆంధ్రా బ్యాంక్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ప్రక్కనే ప్రదర్శనలో ఉన్న కొన్ని స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతం అంతా దట్టంగా పొగతో నిండిపోయింది. ఇతర స్టాళ్లకు మంటలు శరవేగంగా వ్యాపించాయి. సందర్శనకు వచ్చిన ప్రజలు భయాందోళనలతో పరుగుసు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారుగా 10 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు మెట్రో సేవలను ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు. అదనపు మెట్రో రైళ్లను కూడా నడుపుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్ మరియు మేయర్ బొంతు రామ్మోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా 30 స్టాళ్లు దగ్దమైనట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో దగ్దం కావడంతో కోట్ల రుపాయల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. స్టాళ్ల యాజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!