భయపెడుతున్న ఈ–కోలి బ్యాక్టీరియా..!

Tuesday, June 25, 2019 10:42 AM News
భయపెడుతున్న ఈ–కోలి బ్యాక్టీరియా..!

అత్యంత ప్రమాదకరమైన ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి) బ్యాక్టీరియా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వాసులను వణికిస్తోంది. ఇప్పటి వరకు గోదావరి నాదీ జలాలు, పంట కాలువల్లో మాత్రమే ఉన్న ఈ–కోలి బ్యాక్టీరియా ఉనికి ఇప్పుడు భూగర్భ జలాల్లోనూ ఎక్కువుగా కనిపిస్తోంది. పలు రోగాలకు కారణమైన దీని ఉధృతి వర్షాకాలంలో మరింత పెరిగే అవకాశముంది. రాజమహేంద్రవరం నగరంలోని మురుగునీరు, పేపరు మిల్లుల నుంచి వచ్చే వర్థ్య జలాలు, పలు కంపెనీల రసాయనాలు అన్ని గోదావరి నీటిలో కలవటం వలన దీని సాంద్రత రోజురోజుకు పెరుగుతోంది.  గోదావరి నదిలో ఏకంగా ఐదు వేల కాలనీస్‌ (యూనిట్లు) వరకు ఈ–కోలి రికార్డు స్థాయిలో నమోదయిందంటే దీని తీవ్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నదుల నుంచి వచ్చే నీటిలోనూ, భూగర్భ జలాల్లో ఇది ఎక్కువగా ఉందని కోనసీమ కాలుష్యంపై పరిశోధన చేస్తున్న బృందం నిర్ధారించింది.

ఈ నీటినే జిల్లాలో సుమారు 60 శాతం మంది ప్రజలు తాగునీరుగా వినియోగిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, అమలాపురం మున్సిపాలిటీలతోపాటు వందల గ్రామాలకు తాగునీరు కలుషితం అయ్యి వుంది. ఇటీవల కాలంలో ఆక్వా సాగు విచ్చలవిడిగా పెరగడంతో వృథా అవుతున్న మేతలు, రసాయనాల వల్ల చెరువుల చుట్టుపక్కల సుమారు 2 కి.మీ. మేర నీరు ఉప్పుబారిన పడడంతో పాటు కాలుష్యం కారణంగా భూగర్భ జలాల్లో ఈ–కోలి వ్యాప్తి చెందుతోంది.

ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి). దీనివల్ల ఆయాసం, వాంతులు, కడుపునొప్పి, అతిసార, తీవ్ర జ్వరానికి దారితీస్తోంది. 

For All Tech Queries Please Click Here..!