తుఫాన్‌ గా మారిన తీవ్ర వాయుగుండం

Saturday, December 15, 2018 11:13 PM News
తుఫాన్‌ గా మారిన తీవ్ర వాయుగుండం

తీవ్ర వాయుగుండం తుఫాన్‌ గా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీహ‌రికోట‌కు 646 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 17న రాత్రి తూర్పుగోదావ‌రి- విశాఖ‌ మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉందని వెల్లడించింది. గంట‌కు 16 కిలోమీట‌ర్ల వేగంతో పెథాయ్‌ తుఫాన్‌ క‌దులుతుందని తెలిపింది. తుఫాన్‌ గమనాన్ని ఆర్టీజీఎస్‌ అనుక్షణం గ‌మ‌నిస్తుంది. దీంతో ఆర్టీజీఎస్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు నిరంత‌రం హెచ్చరికలు జారీ అవుతున్నట్లు తెలిపింది.