చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా, పూర్తి వివరాలు

Friday, April 3, 2020 07:32 AM News
చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా, పూర్తి వివరాలు

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. లాక్ డౌన్ విధించినప్పటికీ ఈ వైరస్‌తో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం కొంచం ఆందోళనకరమే. మరణాల సంఖ్య కూడా అధికమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టినా ఈ కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సమావేశాల తర్వాత దేశంలో ఈ వైరస్ మరింత వ్యాపించింది. 

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 477 కొత్త కేసులు నమోదయ్యాయని , 17 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2275 కాగా మరణాల సంఖ్య 72 గా ఉంది.

తాజా పరిస్థితి ఇలా ఉంది..

మహారాష్ట్రలో 416 పాజిటివ్‌ కేసులు..19 మంది మృతి

కేరళలో 286 పాజిటివ్‌ కేసులు.. ఇద్దరు మృతి

తమిళనాడులో 309 పాజిటివ్‌ కేసులు.. ఒకరు మృతి

ఢిల్లీలో 219 కరోనా పాజిటివ్‌ కేసులు..ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ లో  149 కరోనా పాజిటివ్‌ కేసులు..ఎవరు చనిపోలేదు.

తెలంగాణాలో 154 కరోనా పాజిటివ్‌ కేసులు..9 మంది మృతి

కర్ణాటకలో 110 పాజిటివ్‌ కేసులు.. ముగ్గురు మృతి

గుజరాత్‌లో 82 పాజిటివ్‌ కేసులు..ఆరుగురు మృతి

పంజాబ్‌లో 46 కరోనా పాజిటివ్‌ కేసులు.. నలుగురు మృతి

యూపీలో 113 పాజిటివ్‌ కేసులు.. ఇద్దరు మృతి

బెంగాల్‌లో 37 కరోనా పాజిటివ్‌ కేసులు.. ముగ్గురు మృతి

బిహార్‌లో 23 పాజిటివ్‌ కేసులు.. ఒకరు మృతి

జమ్మూకశ్మీర్‌-62, హర్యానా-43, చండీగఢ్‌-16, చత్తీస్‌గఢ్‌-9..

రాజస్థాన్‌-108, ఒడిశా-4, పుదుచ్చేరిలో మూడు పాజిటివ్‌ కేసులు

మణిపూర్‌, మిజోరాం, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌లో ఒక్కో కేసు నమోదు

For All Tech Queries Please Click Here..!
Topics: