డీఎస్సీ దరఖాస్తులో తప్పులకు చివరి ఛాన్స్

Wednesday, December 5, 2018 09:42 PM News
డీఎస్సీ దరఖాస్తులో తప్పులకు చివరి ఛాన్స్

డీఎస్సీ-2018 దరఖాస్తులో కులం, పుట్టిన తేదీ, విద్యార్హతలు, మీడియం, సబ్జెక్టు, పోస్టులతో పాటు మెరిటోరియస్‌ స్పోర్ట్స్‌, మాజీ సైనికులు, ప్రత్యేక ప్రతిభావంతుల అంశాలకు సంబంధించి అభ్యర్థులు తప్పుగా రాసినట్లయితే సవరణకు చివరి అవకాశం ఇస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి తెలిపారు.  వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల బాక్సులోకి వెళ్లి... తమ తప్పులను నమోదు  చేసుకోవాలని .. సవరించి సంక్షిప్త సందేశాలు పంపుతామని తెలిపారు. బుధవారం ఉదయం నుంచి డిసెంబరు 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటలలోగా పొరపాట్లను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని  సూచించారు.