అమెరికాలో ఒక్కరోజే 1169 మంది బలి: న్యూయార్క్, న్యూజెర్సీ లలో విలయతాండవం..!

Friday, April 3, 2020 10:02 AM News
అమెరికాలో ఒక్కరోజే 1169 మంది బలి: న్యూయార్క్, న్యూజెర్సీ లలో విలయతాండవం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా తప్ప లేదు. వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చేలాగే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల రెండు లక్షల మంది మరణించే అవకాశం ఉందంటూ ఆ దేశ అధికారులు వేసిన లెక్కలు కూడా నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజే 1169 మంది కరోనా వైరస్‌కు బలి అయ్యారు. భయానక కరోనా వైరస్ బారిన పడి అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. అమెరికాలో కరోనా వైరస్ అమెరికా చెరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసానికి దిగింది.

న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో మరణాల సంఖ్య అత్యధికంగా ఉండటానికి ప్రధాన కారణం సరైన వైద్య పరికరాలు లేకపోవడమేనని తెలుస్తోంది. వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో చూస్తూ, చూస్తుండగానే కరోనా బాధితులు ప్రాణాలను వదిలేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,45,000లను దాటేసింది. మృతుల సంఖ్య 5 వేలకి చేరింది.

For All Tech Queries Please Click Here..!
Topics: