పెట్రోల్, డీజల్ ధరల కంటే విమాన ఇంధనమే చీప్

Wednesday, January 2, 2019 03:53 PM News
పెట్రోల్, డీజల్ ధరల కంటే విమాన ఇంధనమే చీప్

మనం ప్రతి రోజూ ఉపయోగించే పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇటీవల కాలంలో వరుసగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగివస్తుండటంతో దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇంధన ధరలను మరింత తగ్గించాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ మరియు డీజల్ ధరలతో పాటు విమానాల్లో ఉపయోగించే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)ధరలను తాజాగా సవరించాయి. తాజా సవరణతో 1,000 కిలో లీటర్ల ఏటీఎఫ్ ఇంధన ధరకు రూ. 9,990 తగ్గించి రూ. 58,060.97 గా ప్రభుత్వ ఖరారు చేసింది.

మంగళవారం ( జనవరి 02, 2019) ప్రకారం, ఢిల్లీలో ఏటీఎఫ్ ఇంధన ధర కిలో లీటరుకు రూ. 58.07 గా ఉంది. అదే విధంగా ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 68.65 మరియు లీటర్ డీజల్ ధర రూ. 62.66 లుగా ఉన్నాయి. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.72.82 ఉండగా.. డీజిల్ రూ.68.11 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.72.38 ఉండగా.. డీజిల్‌ ధర రూ.67.34 వద్ద కొనసాగుతోంది. అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజల్ ధరల కంటే విమాన ఇంధన ధరే తక్కువగా ఉంది.