సీన్‌ రివర్స్‌ ..అవాక్కయిన కేంద్ర మంత్రి..

Friday, December 7, 2018 04:49 PM News
సీన్‌ రివర్స్‌ ..అవాక్కయిన కేంద్ర మంత్రి..

'' అనుకున్నదొకటి..అయినదొకటి '' అన్న చందంగా బిజెపి నేతల హడావిడి మారింది. సీన్‌ రివర్స్‌ అయ్యింది. శుక్రవారం ఉదయం బిజెపి సభ్యుడు ప్రకాష్‌ జవదేకర్‌, ఎపి సిఎం చంద్రబాబు విద్యనభ్యసించిన టిపిపిఎం స్కూలును పరిశీలించారు. పాఠశాలలో కనీస వసతులు లేవని గుర్తించిన బిజెపి నేతలు, చంద్రబాబు అసమర్థతను ఎత్తి చూపేందుకు ఇదే సరైన ప్రాంతమని ఎంచి వెంటనే బిజెపి నేతలంతా కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రెస్‌ మీట్‌ పూర్తి చేసి హడావిడిగా టిపిపిఎంకు కేంద్రమంత్రి వచ్చారు. కేంద్ర మంత్రి వచ్చి చూసేటప్పటికి సీన్‌ రివర్స్‌ అయ్యింది. '' తాడిదన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు ఇంకొకడు '' అన్నట్లు ఒక్కసారిగి స్కూల్‌ వాతావరణం మారిపోయింది. విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు అన్నీ స్కూల్‌లో ఉండటంతో బిజెపి నేతలు, కేంద్ర మంత్రి అవాక్కయ్యారు. దీంతో చేసేది లేక .. ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నానని కేంద్రమంత్రి మీడియాకు చెప్పి వెనుదిరిగారు.