కర్నూలు జిల్లాలో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం ..!

Tuesday, June 18, 2019 10:30 AM News
కర్నూలు జిల్లాలో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం ..!

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శీతలగిడ్డంగిలో (కోల్డ్ స్టోరేజ్) మంటలు చెలరేగాయి. దీంతో కోల్డ్ స్టోరేజ్లో భారీగా నిల్వవుంచిన ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న నందికొట్కూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రాధమిక నివేదిక ప్రకారం షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు, నందికొట్కూరు వైసీపీ MLA రైతులతో మాట్లాడారు.

For All Tech Queries Please Click Here..!