కరోనా డేంజర్ బెల్స్, 30 శాతం జిల్లాల్లో ప్రభావం, పెద్ద జిల్లాల్లో 60 శాతం పాజిటివ్

Saturday, April 4, 2020 04:00 PM News
కరోనా  డేంజర్ బెల్స్, 30 శాతం జిల్లాల్లో ప్రభావం, పెద్ద జిల్లాల్లో 60 శాతం పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. చాపకింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రజలను భయపెడుతుంది. దేశంలోని 30 శాతం జిల్లాలకు వైరస్ వ్యాపించిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 720 జిల్లాలు  ఉండగా 211 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని పేర్కొన్నది. కొన్ని పెద్ద జిల్లాల్లో 60 శాతం మేర వైరస్ ప్రభావం ఉందని మిగతా జిల్లాల్లో 30 శాతం వరకు ఎఫెక్ట్ చూపించిందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో వైరస్ పరీక్షించే కిట్ల కొరత ఉందని విరించారు. అవసరమైన సదుపాయాలు కూడా లేవని తెలిపింది.

దేశవ్యాప్తంగా 6 వేల వెంటిలెటర్లు, 2 వేల ఐసీయూ పడకలు ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఆయా జిల్లాలు, ప్రధాన నగరాల్లో 100 కరోనా వైరస్ సదుపాయాలు కల్పించే సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపింది. వెంటిలెటర్ల సంఖ్య పెంచుతున్నామని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

For All Tech Queries Please Click Here..!
Topics: