పలు ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 25 నోటిఫికేషన్లు

Friday, December 28, 2018 10:01 AM News
పలు ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 25 నోటిఫికేషన్లు

రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెలాఖరుకు 25 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల నోటిఫికేషన్లతో పాటు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు ఈ నోటిఫికేషన్లు విడుదలవుతాయని స్పష్టంచేశారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు. గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులు తెలుగుభాష పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని తెలిపారు. ఆంగ్లంతో పాటు తెలుగు భాష పరీక్ష అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం ఉంటుందని వివరించారు.