అమెరికాలో కరోనా మృత్యు ఘోష

Saturday, April 4, 2020 10:28 AM News
అమెరికాలో కరోనా మృత్యు ఘోష

ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది, ఎక్కడో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు 192 దేశాలను కబళిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ బాడిన కొన్ని 55 వేలకు పైగా మృత్యువాత పడ్డారు. కొన్ని దేశాల్లో అయితే మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు కూడా చోటు లేకుండా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అగ్రరాజ్యం అమెరికా ఇందుకు మినహాయింపు కాదు. అమెరికాలో రోజురోజుకూ కరోనావైరస్ పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.

గురువారం నుంచి శుక్రవారం వరకు అమెరికాలో కరోనావైరస్ బారిన పడి 1500 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ ట్రాకర్ ద్వారా మృతుల విషయం బయటపడింది. ఇలా 24 గంటల్లోనే ఈ స్థాయిలో మృతిచెందడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా కరోనావైరస్ అమెరికాలో వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు 7,406 మంది మృతి చెందారు.

For All Tech Queries Please Click Here..!
Topics: